రాష్ట్ర ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. గురువారం బోనకల్ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ళను అనర్హులకు కేటాయించడం వల్ల అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నారని చెప్పారు. అర్హులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని పేర్కొన్నారు.