ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నూతన నిర్మాణ పనులకు గురువారం మండల అధికారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోటా రాంబాబు, స్థానిక గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.