బోనకల్: ముగిసిన రెవెన్యూ సదస్సులు

భూభారతి చట్టంలో భాగంగా బోనకల్ మండలవ్యాప్తంగా ఈ నెల 5 నుంచి నిర్వహించిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం ముగిశాయి. గోవిందాపురం(ఏ) గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 59 మంది రైతులు భూ సమస్యలకు సంబందించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ పున్నం చందర్ మాట్లాడుతూ. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మైతిలి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్