బోనకల్: ప్రభుత్వం తీరు మార్చుకోవాలి

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బోనకల్ మండలంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిట్ అధికార పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మాజీ సీఎంను విచారించే పద్ధతి సిట్ కు తెలియదని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్