సీపీఎం నేత సామినేని రామారావు హత్యపై ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా నాయకులు హత్యకు గురవుతుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మౌనం వహించడంపై ఆయన ప్రశ్నించారు. అలవాల శ్రీనివాసరావు, రామారావు హత్యలకు భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.