ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిడమనూరి వంశీ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.