చింతకాని మండలం పందిళ్లపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 25 ట్రిప్పుల ఇసుక కుప్పలను మంగళవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కూపన్లు లేకుండా ఇసుక నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్ఐ ఏకవీర తెలిపారు. అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై రెవెన్యూ శాఖ విచారణ చేస్తోంది.