ఎర్రుపాలెం మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లి కట్టలేరులో గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం గల్లంతైన ముగ్గురు వ్యక్తులు బాదావత్ రాజు (55), భూక్యా కోటి (46), భూక్యా సాయి (25) మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు మధిర సీఐ మధు తెలిపారు.