జమలాపురం ఆలయంలో భక్తుల కిటకిట

ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీంతో భక్తులతో ఆలయం కిటకిట లాడింది. స్వామి ఉత్తర ద్వారం దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వరస్వామి, పద్మావతి, అలివేలు మంగ అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. దర్శన అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్