ఎర్రుపాలెం: మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన

ఎర్రుపాలెం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద గోపవరం గ్రామానికి చెందిన జ్ఞాన ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మధిర రూరల్ సీఐ మధు. ఎస్ఐలు రమేష్, కిశోర్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్