ఎర్రుపాలెం: కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఎర్రుపాలెం మండలంలోని బంజర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కట్టలేరు నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం 9 మంది వేటకు దిగగా, బాదావత్ రాజు (55), భూక్యా కోటి (46), భూక్యా సాయి (25) గల్లంతయ్యారు. వారి కోసం 25 మంది NDRF బృందం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అధికారులు గజ ఈతగాళ్లతో సహా రక్షణ బృందాలను రంగంలోకి దించి గాలింపు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్