మధిర నియోజకవర్గ స్థాయిలో 5 మండలాల బి.ఎల్.ఓ శిక్షణలో భాగంగా శుక్రవారం చివరి రోజు మధిర టి. వి. ఎం ప్రభుత్వ పాఠశాలలో నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం అండ్ కెపాసిటీ బిల్డింగ్ పై శిక్షణా కార్యక్రమం తహశీల్దార్ రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటర్ గా నమోదు చేసుకోవాలని తెలిపారు.