ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం రాత్రి వచ్చిన భారీ ఈదురు గాలులకు, వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలు పూర్తిగా ధ్వంసమై రైతులు నష్టపోయారని సీపీఎం నాయకులు తెలియజేశారు. కావున తక్షణమే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.