మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో హోమియోపతి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని హోమియోపతి వైద్య అధికారి డాక్టర్ భార్గవి మంగళవారం తెలిపారు. ఇప్పటివరకు హోమియోపతి చికిత్స కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై స్థానికంగానే సేవలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం రోగులు ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహాలు, ఉచిత చికిత్స పొందవచ్చని తెలిపారు.