మధిరలో ఐటీ హబ్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల హామీ మేరకు మధిర గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 43లో 1.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐటీ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయాలని టీజీఐసీసీ ఆదేశించింది. దీంతో స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.