ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా, చింతకాని మండలం మత్కేపల్లిలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వాయిదా పడింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతుభరోసా నిధుల విడుదల మాత్రం వాయిదా వేయకుండా, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనుంది.