మధిర మండలం మాటూరుపేటకి చెందిన 58 ఏళ్ల వ్యవసాయ కూలీ కటారు పెద్దవెంకటేశ్వర్లు వడదెబ్బతో మృతి చెందారు. బుధవారం సుబాబుల్ పొలానికి కాపలాకు వెళ్లిన ఆయనకు మధ్యాహ్నం వాంతులు, చెమటలు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ముందుగా మధిరలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.