మధిర: పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి

గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. మధిర బోడెపూడి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఎంతమందికి ఇల్లు కేటాయించారో గ్రామసభ పెట్టి చెప్పగలరా అని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్