సీపీఎం నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులు, అక్రమ కేసులకు నిరసనగా ఈ నెల 3న మధిరలో భారీ నిరసన, ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు తెలిపారు. స్థానిక బోడెపుడి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని సమస్యలపై మాట్లాడుతారన్నారు.