మధిర: సోలార్ ప్లాంట్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మధిర నియోజకవర్గంలో సరికొత్త ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో రూ. 3 కోట్లతో నిర్మించిన 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రారంభించారు. 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ సోలార్ ప్లాంట్ నిర్వహించబడుతుంది. దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాలు పూర్తి బాధ్యతతో నిర్వహించే సోలార్ పవర్ ప్లాంట్‌గా ఇది నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్