మధిర: 50 శాతం సబ్సిడీతో జీలుగ విత్తనాల పంపిణీ

మధిర మండలం దెందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం 50 శాతం సబ్సిడీతో జీలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. సొసైటీ ఛైర్మన్ కోట వెంకటకృష్ణ మాట్లాడుతూ, రైతులు ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకుని భూసారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆధార్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ తో ఏఈఓ వద్ద అనుమతి పొంది విత్తనాలు పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్