మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం మాజీ సీఎం కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని జెడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు స్పష్టం చేశారు. శుక్రవారం మడుపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రూ. 100 కోట్లు వెచ్చించి పట్టణ రూపురేఖలు మార్చామని, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కుల సుందరీకరణ వంటి పనులను నాణ్యతతో పూర్తి చేశామని గుర్తు చేశారు.