తెలంగాణలో వికసిత్ తెలంగాణ లక్ష్యంగా రూ. 8 వేల కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఈ నెల 10న హైదరాబాదులో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మధిరలో బుధవారం జరిగిన అసెంబ్లీస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం గ్రామాల్లో 'చలో హైదరాబాద్' పేరిట గోడలపై వాల్ పెయింటింగ్ వేయాలని సూచించారు.