మధిర: ప్రభుత్వ స్థలాల్లోనే ఎన్టీపీ ప్లాంట్లు

మధిరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు జరుగుతున్న నేపథ్యంలో, మురుగు నీటిశుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ)ను ప్రభుత్వ స్థలాల్లోనే ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈఈ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, మున్సిపల్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యులు గురువారం ఇల్లెందులపాడు, మడుపల్లి, అంబారుపేట సమీపంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. గుర్తించిన స్థలాలపై నివేదికను కలెక్టర్ కు పంపాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్