ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మధిర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ప్రజా పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. సీపీఎం పార్టీ చేపట్టిన నిరసనల ఫలితంగానే నేడు వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.