మధిర: తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ మధిర తహశీల్దార్ కార్యాలయాన్ని సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో మహిళలు ముట్టడించారు. అసలైన పేదలకు కాకుండా అర్హతలేని వారికి ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలన్నారు. అన్యాయం జరిగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్