తెదేపా ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ డా. వాసిరెడ్డి రామనాథం ఆదివారం మధిరలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎంగా మచ్చలేని పాలన అందించిన చంద్రబాబును దూషించడం తగదని, కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న అంబటిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.