ఖమ్మం జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధిర మండల వైద్యాధికారుల సూచనలతో మండల వైద్య ఫీల్డ్ అసిస్టెంట్ లంక కొండయ్య ఆధ్వర్యంలో గురువారం మధిర మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.