మధిర: ఇందిరమ్మ ఇళ్లు రాలేదని మహిళ నిరసన

ఇందిరమ్మ ఇల్లు కోసం దెందుకూరుకు చెందిన ఓ కుటుంబం నిరసనకు దిగింది. ఈమేరకు మధిర తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. అర్హత ఉన్న కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని, అధికార పార్టీ కక్షపూరితంగా ఇళ్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళ అయిన తనకు ఇల్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్