మధిరకు మాస్టర్ ప్లాన్: డిప్యూటీ సీఎం

మధిర మున్సిపాలిటీ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మధిర వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ విగ్రహం నుండి క్యాంపు కార్యాలయం వరకు నడిచి వెళ్తూ ఇరుపక్కలా పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్