ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 21న మధిర మండల కేంద్రంలో 80 కంపెనీల ఆధ్వర్యంలో 5, 000 ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మధిర కాంగ్రెస్ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.