ముదిగొండ: లారీ ఢీకొనడంతో బైక్ నుజ్జునుజ్జు

ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం అండర్ క్రాస్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. అయితే, బైక్ నడిపిన గుదిమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్