ముదిగొండ: పొలంలోకి దూసుకెళ్లిన కారు

శనివారం సాయంత్రం ముదిగొండ మండలంలోని సువర్ణపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి చిరుమర్రి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి సమీపంలోని పంట పొలంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్