ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం పండ్రేగుపల్లి తదితర గ్రామాల్లో నర్సరీ, పశువుల షెడ్ ను ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీలో భాగంగా మంగళవారం ఎంపీడీఓ శ్రీధర్ స్వామి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ లకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించి, పనుల్లో లోపాలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.