మధిర పట్టణంలో నూతనంగా నిర్మితమవుతున్న రైల్వే మూడో లైన్ పనులను శుక్రవారం మండల బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మధిరలో అండర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని చూపకపోవడంతో ఆ పనులు ఆలస్యం అవుతున్నాయని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని సూచించాలని తెలియజేశారు.