పాలేరు: తప్పిదాలు మీరు చేసి.. మాపై దుష్ప్రచారమా?: భట్టి

గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. 'ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు. తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్