మధిర రైల్వే ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ నంబూరు రామారావును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు తీవ్రంగా గాయపడి, రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు.