మధిరలో జులై 1 నుండి శాతవాహన రైలు ఎర్రుపాలెం ఆగనున్నట్లు రైల్వే శాఖ తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మండల వాసుల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎర్రుపాలెం మండల బీజేపీ అధ్యక్షులు కొమ్మినేని కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకులు నూతక్కి నరసింహారావు, అనుమోలు సురేష్, దేవరకొండ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు కత్తి రవి, కృష్ణారెడ్డి, రాంబాబు ఒక ప్రకటనలో బీజేపీ నాయకుల కృషి ఫలితంగానే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎర్రుపాలెం హాల్టింగ్ సాధ్యమైందని పేర్కొన్నారు.