ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను గురువారం మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని తెలిపారు.