మధిరలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానిక రిలయన్స్ మార్ట్ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.