ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో కొందరు నాయకులు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి పదివేల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం మధిర మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.