చింతకాని: యూరియా కోసం రైతులు, అధికారులకు వాగ్వాదం

చింతకాని మండలం లచ్చగూడెంలోని రైతు వేదికలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కూపన్లు ఉన్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో, కూపన్ల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితిని గమనించిన ఏడీఏ విజయ్ చంద్ర, ఏవో మానస రైతులకు అవగాహన కల్పించి శాంతింపజేశారు. అనంతరం కూపన్లను సీరియల్ పద్ధతిలో అందజేశారు.

సంబంధిత పోస్ట్