చింతకాని: 3, 017 మెట్రిక్ టన్నుల యూరియా

మూడు జిల్లాల రైతుల అవసరాల కోసం ఆర్ఎఫ్ సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింటుకు చేరింది. ఏఓ(టెక్నికల్) పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఇందులో 1,517.16 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, 500 మె. టన్నులు భద్రాద్రి జిల్లాకు, 800 మె. టన్నులు మహబూబాబాద్ జిల్లాకు సరఫరా చేశారు. మరో 200 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్ గా నిల్వ చేశారు.

సంబంధిత పోస్ట్