చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పత్రాన్ని అందుకున్న ఓ వృద్ధురాలు భట్టి ఎదుటే డ్యాన్స్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భట్టితో పాటు అక్కడున్న కలెక్టర్ అనుదీప్ ఆమెను చూసి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంలో ఆ వృద్ధురాలి కళ్ళలో ఆనందం అంతా ఇంతా కాదు.