మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం చింతకానిలో మధిర నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భట్టి పాల్గొని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు.