జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మారథాన్, స్కేటింగ్ పోటీల్లో న్యూ విజన్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని ప్రిన్సిపల్ ఎం.డి. అబాద్ అలీ తెలిపారు. హైదరాబాద్ బోరంపేటలో నిర్వహించిన ఎస్ ప్రో ఓపెన్ మీట్ స్కేటింగ్ పోటీల్లో బాలికల విభాగంలో జి. సోనాక్షి అండర్–12 కేటగిరీలో స్వర్ణ పతకం సాధించగా, సి.హెచ్. తన్వి, బి. గీతిక అండర్–15 విభాగంలో వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన మారథాన్ 5కీమీ పరుగు పందెంలో పాఠశాల విద్యార్థి ఎస్.కె. మహ్ఫజ్ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కూరపాటి అండ్ మ్యాక్స్ హాస్పిటల్, ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కీమీ పరుగు పందెంలో సదరు విద్యార్థి ద్వితీయ స్థానం సాధించి రూ.3,000 నగదు బహుమతితో పాటు రజత పతకాన్ని అందుకున్నట్లు తెలిపారు. వైజాగ్ మారథాన్ 2026 లో నిర్వహించిన 5 కీమీ పరుగులో రజిత పథకం సాధించినట్లు తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సి.హెచ్. కార్తీక్, ప్రిన్సిపల్ ఎం.డి. అబాద్ అలీ అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని, క్రీడా స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.