కాయిన్స్ తీసుకోకపోవడంతో గొడవ

నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురం సమీపాన ఉన్న పెట్రోల్ బంక్‌లో బోదులబండకి చెందిన హరీశ్ అనే వాహనదారుడు రూ.163 పెట్రోల్ కొట్టమన్నాడు. బంకులో పనిచేసే వ్యక్తే హరీశ్ వద్ద ఉన్న చిల్లర కాయిన్లను చూసి ఫోన్ పే చేస్తేనే పెట్రోల్ కొడతానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బంక్ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించారని వాహనదారుడు సిబ్బంది, యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్