రొట్టెలు అడుగుతూ నగదు చోరీ!

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి వింత చోరీ జరిగింది. ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి జొన్న రొట్టెలు కావాలని అడిగి, నిర్వాహకులు పనిలో ఉండగా గల్లాపెట్టెలోని నగదును ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్