ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో గురువారం నిర్వహించిన 'భూ భారతి' రీ-సర్వే అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్. ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.