కూసుమంచిలో బంకుల వద్ద వాహనదారుల రద్దీ

కూసుమంచి మండలంలో రెండు రోజులుగా ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నుంచే మండలంలోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. సోమవారం చేగొమ్మ క్రాస్ రోడ్డులోని పెట్రోల్ బంకుకు ఇంధన ట్యాంకర్లు రావడంతో, విషయం తెలుసుకున్న వాహనదారులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. ఈ కొరతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్